బాలివుడ్ కంటే హాలివుడ్ ఉన్న క్రేజ్ ఏమిటో ఈ సీన్ తో అర్థమవుతుంది. బాలీవుడ్ కండలరాయుడు సల్మాన్ ఖాన్ భారత్ లో సినీ సూపర్ స్టార్లలో ఒకడు. సల్మాన్ భారత్ లోనే కాదు అనేక దేశాల్లో అభిమానుల సంపాదించుకున్నాడు. అయితే, ఓ హాలీవుడ్ హీరోకి తనను తాను పరిచయం చేసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇటీవల సౌదీ అరేబియాలో రియాద్ లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ ను కూడా ఆహ్వానించారు. అది ఓ ప్రభుత్వ అవార్డుల కార్యక్రమం. ఈ వేడుకకు హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టా కూడా వచ్చాడు. బ్రోకెన్ యారో, పల్ప్ ఫిక్ష్, ఫేస్ ఆఫ్, బాటిల్ ఫీల్డ్ ఎర్త్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కాగా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన సల్మాన్, ట్రవోల్టా ముందువరుసలో పక్కపక్కనే కూర్చున్నారు. ఈ సందర్భం సల్మాన్ తనను తాను పరిచయం చేసుకుని, గతంలో పలు చిత్రాల్లో ట్రవోల్టా నటనను కొనియాడారు. అందుకు ట్రవోల్టా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa