ఏపీ స్కీల్స్ డెవలప్‌మెంట్ ఆఫ్ కార్పొరేషన్ వారు విజయవాడలో నిరుద్యోగుల కోసం ఈ నెల 4న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఎంటీఏఆర్ టెక్నాలజీస్ ప్రై.లి. ఆధ్వర్యంలో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత పొందిన వారికి నెలకు 12 వేల నుంచి 25 వేల జీతం ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేయవల్సి ఉంటుంది. అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు విద్యార్హత ధృవపత్రాలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ జీరాక్స్‌లతో విజయవాడలోని ఆంధ్ర లోయల ఇన్‌స్ట్రిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు హాజరుకాగలరని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa