ఓ ఉపాధ్యాయుడు 39 ఏళ్ల పాటు కష్టపడి కూడబెట్టిన డబ్బును పేద విద్యార్థుల కోసం ఇచ్చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఖాందియా ప్రాంతంలో టీచర్ విజయ్ కుమార్ చాన్సోరియా మొత్తం రూ.40 లక్షలు దానం చేశారు. సోమవారం ఆయన పదవీవిరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆ విషయాన్ని విజయ్ ప్రకటించారు. తన భార్యాపిల్లల సమ్మతితో ఇన్నేళ్లుగా తాను దాచుకున్న పీఎఫ్, గ్రాట్యుటీ నిధులను పేద విద్యార్థులకు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలో బాధలన్నింటినీ మనం తగ్గించలేం కానీ చేయాల్సినంత మంచి చేద్దాం అని ఆయన అన్నారు. తాను రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నానని, చదువంటే ఆసక్తి ఉన్న పేదలకు ఆ కష్టం రావొద్దనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని విజయ్ కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa