ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 04:41 PM

కడప నగరం ఆర్టీసీ బస్టాండు సర్కిల్లో విధి నిర్వహణలో ఉన్న కమలాకర్ అనే చిన్నచౌకు కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకుని ప్రజల ప్రశంసలను అందుకునన్నారు. బద్వేలకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ దివ్యాంగుడిని గమనించిన కానిస్టేబుల్ స్వయంగా ఎత్తుకుని బస్సును అపి ఎక్కించారు. నేడు ఆ మార్గంలో ఎందరో ప్రజలు వెళుతుంటారు. అయినప్పటికీ ఎవరి బిజీలో వారు తమకెందుకులే అన్నట్లు వెళుతున్న తరుణంలో కానిస్టేబుల్ కమలాకర్ మానవత్వాన్ని ప్రదర్శించి కాళ్లు లేని దివ్యాంగుడిని ఎత్తుకుని బస్సును ఆపి ఎక్కించడం అక్కడి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. దివ్యాంగుడికి కానిస్టేబుల్ అందించిన చేయూతను చూసి అక్కడి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ అన్బురాజన్ కానిస్టేబుల్ కమలాకర్ ను ప్రత్యేకంగా అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa