ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలతో మధ్యాన్న భోజనం చేసిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 04:52 PM

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహార విషయంలో సమతుల్యత పాటిస్తున్నదని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం కొవ్వూరు మండలం పసివేదల ప్రాథమిక పాఠశాలలో పిల్లలతో మధ్యాన్న భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక మేనమామలా ఆలోచించి చిన్నారులకు మధ్యాన్న భోజన పథకంలో అందచేసే ఆహార పదార్థాలు విషయంలో క్యాలెండర్ స్వయంగా రూపుదిద్దడం జరిగిందన్నారు. ఇదే మన సీఎం పిల్లలు పట్ల ఉన్న చిత్తశుద్ధి ని తెలియచేస్తుందని తానేటి వనిత తెలిపారు. పాఠశాల లో అందచేస్తున్న భోజనం పట్ల పిల్లలు ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. ఇక్కడి ఆహార పదార్థాలు రుచిగా ఉండడమే కాకుండా అత్యంత శుభ్రతను పాటించడం పట్ల నిర్వాహకులను మంత్రి అభినందించారు. అనంతరం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa