ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పలుచోట్ల పవర్ కట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 08:48 AM

ఏపీలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తూర్పు గోదావరి జిల్లాలో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో పలు ప్రాంతాల్లో కోతలు విధిస్తున్నారు. కాకినాడ జిజిహెచ్ మినహా మిగతా ప్రాంతాల్లో 3 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురం డివిజన్, తుని, సీతానగరం, రామచంద్రాపురం డివిజన్, తొండంగి, అనపర్తి, పెద్దాపురంలో సాయంత్రం 6 గంటల నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. ప్రకాశం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో సైతం విద్యుత్ సరఫరా నిలిచింది.

రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో విద్యుత్ కోతలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గింది. వీటీపీఎస్, ఆర్టీపీపీ, కృష్ణపట్నం కేంద్రాల్లో 1700 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. దీంతో 3 డిస్కంల పరిధుల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa