మెరుగైన పీఆర్‌సీ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల నిరసనలు పెల్లుబికుతున్నాయి. రాష్ట్రమంతటా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన కమిటీ వారితో పలు దఫాలు చర్చలు జరిపింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన నూతన పీఆర్‌సీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, జీతాలు తగ్గితే ఊరుకోబోమని ఉద్యోగులు చెబుతున్నారు. పీఆర్‌సీ జీతాలు కోల్పోవడం దారుణమంటూ ఇటీవల పోలీసుల ఆంక్షలను దాటుకుని మరీ విజయవాడలో భారీ ప్రదర్శన చేపట్టారు. తమ నిరసనను తెలియజేస్తూ సమ్మెలోకి వెళ్లనున్నట్లు సైతం ప్రకటించారు. వీరికి ఆర్టీసీ ఉద్యోగులు సైతం గొంతు కలిపారు.
ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యాన ఏపీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని వాపోతున్నారు. తమకు గతంలో ఉండే అన్ని సౌకర్యాలనూ ప్రభుత్వం కట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం చెబుతున్నా, తాము ఏ ప్రయోజనాలనూ పొందలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ఇక పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు తాము సైతం సమ్మెకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చిత్తూరు జిల్లాలోని 15 డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగులు శనివారం నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఆదివారం అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa