విశాఖపట్నం: మత్తులో ఆరుగురు యువకులు ఓ బ్యాంకు ఉద్యోగిని కత్తితో బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డారు. కంచరపాలెం జాతీయ రహదారి సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. మాధవధార, వుడా కాలనీలో ప్రాంతానికి చెందిన జీ గణేష్ (35) ద్వారకా నగర్ లోని బ్యాంకులో ప్రైవేట్ గా పని చేస్తున్నాడు. ఇదిలా వుండగా శుక్రవారం నగరంలో ఒక వివహ వేడుకల్లో పాల్గొన్న గణేష్ శనివారం తెల్లవారుజామున ద్విచక్ర వహనంపై పై జాతీయ రహదారి గుండా ఇంటికి బయలుదేరారు. తాటి చెట్లపాలెం నుండి మాదవధార వైపు వెళ్తుండగా, వెనక నుండి రెండు ద్విచక్ర వాహనాల్లో ఆరుగురు గుర్తు తెలియని యువకులు కంచరపాలెం వద్ద గణేష్ ను ఆపి, కత్తితో బెదిరించి అతని నుండి చేతి వాచీ, బ్లూటూత్ హియర్ ఫోన్స్, కొంత నగదును లాక్కొని పారిపోయారు. దీంతో బాధితుడు గణేష్ లబోదిబోమంటూ స్థానిక క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి సంఘటనలు కంచరపాలెం, తాటిచెట్లపాలెం ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు గట్టి నిఘా పెట్టి యువకుల ఆగడాలకు చెక్ పెట్టాలని వారంతా కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa