ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చూపులేకున్నా సంపాదనలో ఆమె మేటి

national |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 03:53 PM

మనలో ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య వస్తే క్రుంగిపోతాం. నాకే ఎందుకిలా జరుగుతోందని విచారిస్తూ కూర్చుంటాం. ఇక ఆర్థిక సమస్యలు చుట్టుముడితే, జీవితం తల్లకిందులైందని గగ్గోలు పెడతాం. అయితే ఆమె అందరిలా ఆ మహిళ బాధపడలేదు. తనకు కంటి చూపు పోయినా వెనకడుగు వేయలేదు. చిన్నచిన్నగా వ్యాపారం మొదలు పెట్టి, తన అవరోధాలను అధిగమించింది. సొంతంగా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి, ఆర్గానిక్ ఉత్పత్తులను విజయవంతంగా విక్రయిస్తోంది.


ఆమె పేరు గీత. ఆమెది కేరళలోని త్రిశూర్ ప్రాంతం. తనకు 13 ఏళ్ల వయసులో కంటి చూపు సమస్య తెలెత్తింది. తల్లిదండ్రులు ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. డాక్టర్ వారికి కోలుకోలేని మాట చెప్పారు. ఆమెకు కంటి చూపు సన్నగిల్లుతోందని తెలిపారు. క్రమంగా 15 ఏళ్ళు వచ్చేసరికి, ఉన్న కాస్త చూపు కూడా పోయింది.


ప్రస్తుతం ఆమె వయస్సు 39 ఏళ్లు. తనకు దృష్టిలోపమున్నా, ఆమె ఎప్పుడూ బాధపడలేదు. సమస్యలున్నా, తన భర్త సహకారంతో తాను అనుకున్న వ్యాపారంలో ముందడుగు వేసింది. వ్యాపారంలో విజయవంతమై ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. తన గీతాస్ కుటీర పరిశ్రమల ద్వారా ఆమె నెయ్యి, పచ్చళ్ళు, బాలింతలు తినాల్సిన ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తోంది. నెలకు రూ.50 వేలు సంపాదిస్తూ తాను అనుకున్నది సాధించింది. అంతేకాదండోయ్.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో గ్రాడ్యుయేషన్ సైతం పూర్తి చేసింది. సమస్యలెన్నున్నా, పట్టుదలతో కష్టపడితే సాధించలేనిది ఉండదంటూ తన జీవితం ద్వారా ఎందరికో స్పూర్తినిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa