భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన మనవరాలి వివాహానికి తిరుమలకు చేరుకున్నారు. తిరుచానూరు యోగిమల్లవరంలోని ఓ ప్రైవేట్ కల్యాణమండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. వెంకయ్య నాయుడు కుటుంబీకులు... నలుగు ఇంకా ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఈ కల్యాణ మండపంలో జరగనుండగా, మిగిలిన పెళ్లి వేడుకలు ఈరోజు రాత్రి నుంచి తిరుమలలో జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం తిరుచానూరు కల్యాణ మండపం నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు తిరుమలలోని కల్యాణ మండపానికి వెళ్లనున్నారు. ఈ మేరకు తిరుచానూరు కల్యాణ మండపం వద్ద పోలీసులు, కేంద్ర బలగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa