ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లో కొత్తగా 1,345 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 06:27 PM

పీలో కరోనా వ్యాప్తి నెమ్మదిగా తగ్గుతోంది. నిన్నటి కంటే ఇవాళ ఆ సంఖ్య భారీగా తగ్గింది. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. జాగ్రత్తలు మాత్రం పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 26,393 శాంపిల్స్ ని పరీక్షించగా 1,345 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2307072కి చేరింది. కోవిడ్ కారణంగా చిత్తూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 14683కు చేరింది.
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 40884 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 6,576 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2251505కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,27,59,439 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 309 కొత్త కేసులు వెలుగుచూశాయి. గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలో కూడా వ్యాప్తి ఎక్కువగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 309 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత కృష్ణా జిల్లాలో184 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం – 51, చిత్తూరు – 83, గుంటూరు – 132, వైఎస్ఆర్ కడప – 56, కర్నూలు – 62, నెల్లూరు – 58, ప్రకాశం – 87, శ్రీకాకుళం – 22, విశాఖపట్నం – 110, విజయనగరం – 16, పశ్చిమ గోదావరి – 175 చొప్పున మొత్తం 1,679 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa