ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమతా మూర్తి ని దర్శించుకున్న కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్

national |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 08:54 PM

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో శ్రీరామనుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవమూర్తులతో ప్రధాన యాగశాల నుంచి సమతామూర్తి కేంద్రం వరకు రుత్విజులు శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్ర తర్వాత దివ్యక్షేత్రాల్లోని 20 ఆలయాల్లో విగ్రహాలకు చినజీయర్ స్వామి, వేదపండితులు ప్రాణప్రతిష్ట చేశారు. ఇప్పటికే శ్రీరామ నగరంలోని 32 ఆలయాల్లో ప్రాణప్రతిష్ట పూర్తయింది. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ శ్రీరామనగరం విశేషాలను తెలుసుకున్నారు. 108 దివ్య దేశాలను దర్శించుకున్నారు. సమతామూర్తి కేంద్రంలో మొక్కలు నాటిని రాజ్నాథ్సంగ్ లక్ష్మీనారాయణ క్రతువులో పాల్గొన్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్ తదితరులు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa