ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో మంత్రివర్గ ప్రక్షాళనకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..? అంటే అయ్యిందనే సీఎం క్యాంపు ఆఫీస్ నుండి సమాచారం. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు రంగం సిద్ధమైందా? ముహూర్తం కూడా పెట్టారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. జగన్ తన టీమ్‌లో భారీ మార్పులకు సిద్ధమవుతున్నారని తాడేపల్లి నుండి సమాచారం. ముందుగా మంత్రివర్గ ప్రక్షాళన చేసి ఆ తర్వాత పార్టీని ప్రక్షాళన చేస్తారని తెలుస్తోంది.
ఇవన్నీ పూర్తయ్యాక అధికార యంత్రాంగం ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేయాలని భావిస్తున్నారు. చివరికి తన కుటుంబానికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయానికి దూరమైనట్లు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ విస్తరణ కూడా శుభపరిణామమని జగన్ తేల్చేశారు. ఏపీ మంత్రివర్గ ప్రక్షాళనకు ఫిబ్రవరి 18 అనుకూలమైన రోజుగా జగన్ నిర్ణయించినట్టు సమాచారం.
పైగా మూడు రాజధానుల అంశం కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. వైజాగ్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తామని, మార్చి 4న అసెంబ్లీలో బిల్లు పెట్టే అవకాశం ఉందని, రాష్ట్రంలోని ప్రతి అధికారిని ట్రాన్సఫర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే, Iఐఏయస్ నుండి ప్యూన్ వరకు పార్టీ పరంగా అన్ని పదవులభర్తీ చేస్తారు. పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరగనున్నాయి. కొత్త వారికి, యువతకు అవకాశం కల్పించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.
త్వరలో ఆయన కుటుంబం నుంచి ఒకరిద్దరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. రాజకీయాల్లో ముఖ్యమైన శాఖలో మంత్రిగా తన సన్నిహితుడికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. తనను నమ్ముకున్న వారికి పెద్ద ఎత్తున ప్రభుత్వంలో పదవులు ఇచ్చి వారి సేవలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న వారిని జగన్ పక్కన పెడతారు. అసలు జగన్ బెర్త్ ఎవరికి కేటాయించారు? భూమా ఎవరికి ఇస్తారనేది హాట్ టాపిక్ గా మారుతోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa