బొబ్బిలి పట్టణంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రసవించినట్లు శనివారం కొన్ని ప్రధాన పత్రికలు ప్రచురించబడ్డాయి. ఆ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక గిరిజన బాలిక గురువారం పాఠశాల ఆవరణలోనే ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే పాఠశాల సిబ్బంది ఆటో సహాయంతో ఆ బాలికను ఇంటికి పంపించినట్లు సమాచారం. ఈ విషయమై ఐటిడిఎ అధికారులకు తెలియడంతో శుక్రవారం దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. బాలికలపై పర్యవేక్షణ లేకపోవడం వలనే ఇటువంటి సంఘటన జరిగినట్లు చెపుతున్నారు. బాలిక ప్రసవంపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేయాలని , భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa