ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ప్రతి ఓటు స్వావలంబన భారతదేశం, సాధికార ఉత్తరప్రదేశ్ కోసం'

national |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 03:52 PM

"ప్రతి ఓటు స్వావలంబన భారతదేశం, సాధికార ఉత్తరప్రదేశ్ కోసం' అని యూపీ ఓటర్లకు ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల జరగాల్సి ఉన్న క్రమంలో రాజకీయ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెడుతూనే.. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పారు. అస్పష్టమైన మొహల్లా లేదా యూపీ గ్రామం నుంచి కూడా ప్రతి ఓటు భారతదేశానికి అపారమైన బలాన్ని ఇస్తుంది, ఇది వేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితులలో చాలా కీలకమైనదని ప్రధాని మోడీ అన్నారు. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్.. దేశాన్ని బలోపేతం చేసే అతిపెద్ద బాధ్యతను భుజానకెత్తుకుంది. "ప్రతి ఓటు స్వావలంబన భారతదేశం, సాధికార ఉత్తరప్రదేశ్ కోసం' అని ప్రధాని స్పష్టం చేశారు. అన్నారు. మహిళలను అవమానించింది బీజేపీనే, ముందు పార్టీలో అసమ్మతి చూసుకో: బండికి మంత్రి హరీష్ రావు కౌంటర్ మహిళలను అవమానించింది బీజేపీనే, ముందు పార్టీలో అసమ్మతి చూసుకో: బండికి మంత్రి హరీష్ రావు కౌంటర్ భారతదేశంలో, యూపీలో జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు కనిపిస్తుంది కానీ.. ప్రతిపక్షాలకు మాత్రం కనిపించడం లేదని ప్రధాని మోడీ మండిడ్డారు. అభివృద్ధి చేయని, చూడలేని ప్రతిపక్షాలను ప్రజలు క్షమించరని అన్నారు. పూర్వంచల్ ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చూసిందన్నారు. కుటుంబ పార్టీలు తమ కుటుంబసభ్యుల అభివృద్ధి కోసమే అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను దోచుకుని తమ ఆస్తులను పెంచుకున్నారని ధ్వజమెత్తారు. కరోనా వైరస్ మహమ్మారిని పారద్రోలేందుకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా తమ ప్రభుత్వం అందజేస్తుంటే.. ప్రతిపక్షాలు అపోహలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ప్రధాని మోడీ. 'అభివృద్ధి రేసు నుంచి దూరంగా ఉన్న జిల్లాలను అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది" అని.. మహరాజ్‌గంజ్ వంటి జిల్లాలను సులభతరం చేయడానికి ఇండో-నేపాల్ సరిహద్దులో రోడ్లు ఎలా నిర్మించబడుతున్నాయో ఉదహరించారు ప్రధాని మోడీ. కుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంతో పర్యాటకం పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రధాని మోడీ అన్నారు. గ్రామాల స్వయం సమృద్ధి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కుటుంబ పార్టీల నేతలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలను పేదలుగానే చూడాలనుకుంటున్నారని అన్నారు. వారు మాత్రం పెద్ద పెద్ద కార్లు, విమానాల్లో తిరుగుతున్నారని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం 24 గంటలూ పేద ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తుందన్నారు. తమ పార్టీకి దేశమే కుటుంబం అని, ప్రజలే కుటుంబసభ్యులని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. కాగా, మార్చి 3న ఆరో విడత అసెంబ్లీ ఎన్నికలు యూపీలో జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa