ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంటాడుతున్న రష్యా భయం..అణుదాడికి దిగితే పరిస్థితి ఏమిటీ

international |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 04:06 PM

ఉక్రెయిన్, రష్యాలు తలపడుతూనే చర్చలకు దిగాయి. అయితే శాంతిపై చిగురించిన ఆశలన్నీ ఆవిరైపోయాయి. చర్చలు మొదలైన కొన్ని గంటల్లో అసంతృప్తిగా ముగిసిపోయాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాస్త్రాలను సిద్ధం చేయమని త్రివిద దళాధిపతులను ఆదేశించారు. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం సర్వత్రా నెలకొంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ రష్యావైపు చూస్తున్నాయి. వాస్తవానికి రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ దగ్గర కావాల్సినన్ని ఆయుధాలు లేవు. పైగా ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాల్లో రష్యా ఒకటి. స్టాక్‌హోంలోని SIPRI అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా 6,255 న్యూక్లియర్ వార్‌హెడ్స్ రష్యా దగ్గర ఉన్నాయి. అమెరికా దగ్గర 5,550, చైనా దగ్గర 350, ఫ్రాన్స్ దగ్గర కేవలం 290 మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు పాకిస్థాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా వంటి దేశాల దగ్గర కూడా ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా 3825 అణ్వాయుధాలు మాత్రమే ప్రయోగానికి రెడీగా ఉన్నాయట. అలా చూసినా రష్యా దగ్గర 1625 అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే అణ్వాయుధాలను నియంత్రించే అధికారం రష్యా రాజ్యాంగం ప్రకారం ఆ దేశాధ్యక్షునికి ఉంది. అణ్వాయుధాలను ఉపయోగించడానికి ఆదేశాలివ్వాలంటే రష్యా రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ అనుమతి కూడా అవసరం. అయితే బటన్ నొక్కినట్టు అనుకున్న వెంటనే అణ్వాయుధాలను ప్రయోగించడం అవ్వదు. దానికంటూ ఓ విధానం ఉంటుంది. కొన్ని రోజుల ప్రాసెస్ ఉంటుంది. అందుకే ప్రస్తుతం పుతిన్ సిద్ధం చేయమని ఆదేశాలిచ్చారు. ఇక ఉక్రెయిన్‌ దగ్గర ఎలాంటి అణ్వాయుధాలు లేవు. మామూలుగానే రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ దగ్గర బలం, బలగం తక్కువ. అయినా రష్యా బలగాలను ధీటుగా ఎదుర్కొంటుంది. ఇక అణుబాంబులు చాలా శక్తివంతమైన పేలుడు పదార్థాలు. ఒక అణుబాంబు పేలితే నగరాలకు, నగరాలే తుడుచుకుపెట్టుకుపోతాయి. న్యూ క్లియర్ ఆయుధాలు పేలినప్పుడు ఎంత విధ్వంసం జరుగుతుందో.. తర్వాత కూడా అంతే నష్టం జరుగుతుంది. న్యూ క్లియర్ ఆయుధాలు పేలడం వల్ల అందులో నుంచి రేడియేషన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల కలిగే దుష్ప్రభావాలు దీర్ఘకాలంగా ఉంటాయి. దాదాపు ఆ ప్రాంతంలో మళ్లీ మొక్కలు చిగురించడం కూడా కష్టమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa