ఏపీ ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. 1800 కు పైగా కారుణ్య నియామకాలు చేస్తున్నట్లు ప్రకటించారు. సంబంధిత జిల్లాల్లోనే వారికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఆర్టీసీతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగం కల్పిస్తాం అని అన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయని చెప్పారు.