ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దానిమ్మతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

national |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 04:10 PM

దానిమ్మ గింజలను డైరెక్టుగా తినడం లేదా జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


- దానిమ్మలో కార్బోహైడ్రేట్లు, చక్కెర, ఫైబర్, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్, విటమిన్ సి, థియామిన్, రిబోప్లేవిన్, నియాసిన్, విటమిన్ బి6, ఫోలేట్, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి.
- దానిమ్మ అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
- దానిమ్మను తరచుగా ఆహారంలో భాగం చేసుకుంటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇందులో ఉండే శక్తి వంతమైన టానిన్లు, ఆంథోసైనిన్స్, వంటి యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల నుండి రక్షించటంలో సహాయపడతాయి.
- అంగస్తంభన కణజాలలో రక్త ప్రవాహాన్ని పెంచటం ద్వారా అంగస్తంభన లక్షణాలను మెరుగుపరచటంలో దానిమ్మ దోహదపడుతున్నట్లు ఒక అధ్యయనంలో నిర్ధారణ అయింది. నపుంసకత్వాన్ని
- దానిమ్మ గింజలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధించి, క్యాన్సర్ కణాల మరణాన్ని కూడా ప్రేరేపించే ప్యూనిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. దానిమ్మ రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
- పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్లు , టానిన్లు పుష్కలంగా ఉన్నందున దానిమ్మ తినడం వల్ల ఊబకాయం నివారణకు సహాయపడుతుంది.
- కొవ్వును వేగంగా కరిగించేందుకు, జీవక్రియలను మెరుగుపరచడానికి దానిమ్మ పండ్లు సహాయపడతాయి. దానిమ్మపండు ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.
- దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్ , చర్మపు మంటలను, మొటిమల నుండి కాపాడి చర్మం సామర్థ్యాన్ని పెంచుతాయి.
- జుట్టు రాలే సమస్యలకు దానిమ్మ గింజలను తినటం వల్ల చెక్ పెట్టవచ్చు.
- దానిమ్మలో ఉండే ఐరన్ కారణంగా హిమోగ్లోబిన్ స్ధాయిలు పెరుగుతాయి. రక్తహీనత నుండి కాపాడతాయి.
- విరేచనాలు, అతిసారం, కలరా వంటి సమస్యలను తగ్గించటానికి దానిమ్మ దోహదం చేస్తుంది.
- దానిమ్మ గింజలలో పుష్కలంగా లభించే పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వ్యాధికి కారణమయ్యే మెదడు యొక్క నాడీ కణాల మధ్య పేరుకుపోయే అమిలోయిడ్ ఫలకం స్థాయిలను తగ్గిస్తుంది.
- టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో దానిమ్మపండు పనితీరు బాగుందని అనేక అధ్యయనాల్లో తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com