రెడ్‌క్రాస్ సంస్థలో వైయస్ఆర్సీపీ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తప్పుబట్టారు. నెల్లూరు రెడ్ క్రాస్‌లో ఐదు వేల మంది సభ్యత్వం ఉంటే వాటిలో 90 శాతం మంది పొలిటికల్ పార్టీ వారే ఉన్నారని, వైయస్ఆర్సీపీ వారికి మాత్రమే సభ్యత్వం రద్దు చేయడం దారుణమన్నారు. మంత్రి నారాయణకు రెడ్ క్రాస్ మీద అవగాహన లేదని, కాబట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన కనీసం ఇందులో సభ్యత్వం కూడా తీసుకోలేదన్నారు. నారాయణ మెడికల్ కాలేజ్ లోకీలకంగా ఉండే విజయ్ కుమార్ అనే వ్యక్తిని రెడ్ క్రాస్ లోమెంబర్గా చేర్చి, దాన్ని నాశనం చేయాలని మంత్రి చూస్తున్నారన్నారు. మంత్రి నారాయణ అనుచరులతో కొత్త బాడీని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆనంద్ ప్రయత్నం చేస్తున్నారని చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు.