తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచె రువు మండలం నుంచి వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు టీడీపీలోకి చేరారు. స్థాని క బస్టాండు సర్కిల్‌లో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి దాసరిపల్లి జమయ చంద్రారెడ్డి సమక్షంలో వేపూరికోట వైసీపీ ఎంపీటీసీ శ్రీనివాసులురెడ్డి, వార్డు మెంబరు శీతిరెడ్డి, నాయకులు కార్యం మోహన, రామచంద్రారెడ్డి, మారెప్ప, ఈశ్వరప్ప, రామచం ద్రా, వెంకటరమ, కిష్టా తదితరులు భారీగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి జయ చంద్రారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రచార సమన్వయకర్త సీడు మల్లికార్జుననాయుడు, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, జిల్లా కార్యదర్శి యర్రగుడి సురేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన కేవీ రమణ, నాయకులు మూగి రవిచంద్ర, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.