అనకాపల్లి రోటరీ ఫ్రెండ్షిప్ ఎక్స్చేంజ్ లో భాగంగా రోటరీ క్లబ్ కి అమెరికా నుండి ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విశ్వనాథ్, బ్రెయిన్ రాలి శుక్రవారం అనకాపల్లి విచ్చేసారు. వీరు అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో జీవన విధానాన్ని, రోటరీ చేస్తున్న సేవలను పరిశీలించారు. దీనిలో భాగంగా అనకాపల్లిలో ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలను తిలకించారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకంభిక అమ్మవారిని దర్శించి, బెల్లం మార్కెట్ యార్డ్ పరిశీలించారు.