ట్రెండింగ్
Epaper    English    தமிழ்

65 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం.. భయంతో కుమారుడు, కోడలు

national |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2025, 10:13 PM

బిహార్‌లో ఓ 65 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు నిందితులు. ఇందులో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా.. మరో ఇద్దరు తప్పించుకున్నారు. అయితే ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.  బిహార్‌లోని సఖిసరాయ్ జిల్లాకు చెందిన ఓ 65 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు. వారిద్దరికీ పెళ్లిళ్లు కాగా.. వృద్ధురాలు చిన్న కుమారుడి వద్ద ఉంటోంది. అయితే అతడికింకా పిల్లలు పుట్టలేదు. ఇంటివద్దే ఉంటున్న సదరు వృద్ధురాలు.. ఇప్పటి నుంచే కుమారులకు భారం కావొద్దని భావించి చిన్న కిరాణా దుకాణాన్ని పెట్టుకుంది. తమలపాకులు, సిగరెట్లు వంటివి అమ్ముతూ జీవిస్తోంది. అయితే బుధవారం రోజు అర్ధరాత్రి వీరి ఇంటి తలుపులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు.


 ఎప్పటిలాగే హాల్లో పడుకున్న వృద్ధురాలు.. రాత్రి 1.30 గంటల సమయంలో భయం భయంగానే వెళ్లి తలుపులు తెరిచింది. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు బయట కిరణా కొట్టు మీదే కదా.. నాలుగు సిగరెట్లు ఇవ్వమంటూ అడిగారు. అయితే అర్ధరాత్రి సమయం కావడంతో.. దుకాణం తెరిచి సిగరెట్లు ఇవ్వనని చెప్పింది వృద్ధురాలు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన వాళ్లు.. వృద్ధురాలితో గొడవకు దిగారు. దీంతో ఆమె తలుపులు వేసి లోపలికి వెళ్లిపోయింది. కానీ వాళ్లు మాత్రం అక్కడే ఉండి తలుపులు కొట్టడం ప్రారంభించారు. దీంతో భయపడిపోయిన వృద్ధురాలు, ఆమె కొడుకు, కోడలు ఇంటి వెనుక తలుపు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు.


కుమారుడు, కోడలు తప్పించుకుని సోదరుడి ఇంటికి వెళ్లారు. అదే విషయాన్ని అన్నకు చెప్పగా.. ఆయన వెంటనే డయల్-112కు సమాచారం అందించాడు. కానీ వృద్ధురాలు కావడంతో ఆమె బయటకు వెళ్లలేకపోయింది. ఆలోపే నలుగురు నిందితులు లోపలికి వచ్చి.. ఇంట్లో ఉన్న డబ్బులను దోచేశారు. ఆపై వృద్ధురాలిని పంట పొలాల్లోకి తీసుకు వెళ్లారు. అక్కడే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలోనే అటు కుమారులు, కోడళ్లతో పాటు పోలీసులు రంగ ప్రవేశం చేశారు.


విషయం గుర్తించిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిలో ఇద్దరిని పట్టుకున్నారు. అయితే మరో ఇద్దరు మాత్రం తప్పించుకుని పారిపోయారు. ఈక్రమంలోనే కుమారులు, కోడళ్లు కలిసి మహిళను అంబులెన్సు ద్వారా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి.. తల్లిపై హత్యాచారానికి పాల్పడ్డ ఆ నలుగురు నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వృద్ధురాలి కుమారులు కోరుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన లఖిసరాయ్ ఎస్పీ అజయ్ కుమార్.. మరో ఇద్దరు నిందితులను కూడా త్వరగానే పట్టుకుంటామని చెప్పారు. అలాగే వృద్ధురాలని కూడా చూడకుండా ఇంత దారుణంగా ప్రవర్తించిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com