అనంతపురంలో కొత్త కారు కొనేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. టెస్ట్ డ్రైవ్ కోసం మహేంద్ర ఈవీ కారును రోడ్డుపైకి తీసుకెళ్లాడు. డ్రైవ్ చేస్తుండగా సదరు వ్యక్తి సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న నాలుగు కార్లు ఢీకొట్టుకున్నాయి. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.