కడప జిల్లా జమ్మలమడుగు మండల పరిధిలోని గుడం చెరువు గ్రామంలో జరుగుతున్న రోడ్డు పనులను శుక్రవారం జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ భూపేష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామంలో సీతారాములను ప్రతిష్టించి 41వ రోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.