నిరుద్యోగులకు కృష్ణా జిల్లా డిస్ట్రిక్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గుడ్ న్యూస్ తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తు్న్నట్లు తెలిపారు.ఈ నెల 28న మంగళవారం అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డి.కె. బాలాజీ ప్రకటించారు. ఈ ఉద్యోగ మేళాలో హెటిరో ల్యాబ్స్, ఇన్నోటెక్, నవత రోడ్ ట్రాన్స్ పోర్టు వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, నిరుద్యోగ యువతీయువకులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా పలు కంపెనీల్లోనూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఇందుకు 10వ తరగతి, ఐటీఐ(పిట్టర్, ఎలక్రీషియన్), ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 30 ఏళ్ల లోపు వాళ్లు అర్హులని జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అధికారులు చెప్పారు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతం ఉంటుందని తెలిపారు. ఇంటర్వూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న వాళ్లు అర్హత సర్టిఫికెట్ల జిరాక్సులు తీసుకురావాలని చెప్పారు. పూర్తి వివరాలకు 7995534572,6300618985కు సంప్రదించాలని పిలుపు నిచ్చారు