కడప రవాణాశాఖలో కీచక అధికారిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వేటు వేశారు. కడప రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిపై మంత్రి బదిలీ వేటు వేశారు.
సమగ్ర విచారణ తక్షణమే చేపట్టి అధికారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించినట్లు కడప డీటీసీపై ఆరోపణలు ఉన్నాయి.