బడుగు బలహీన వర్గాలకు దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అండగా నిలిచారని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ శుక్రవారం పేర్కొన్నారు.
ఆయన 20వ వర్ధంతిని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. పరిటాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.