రేపటి మూల స్తంభాలుగా నేటి ఆడబిడ్డలు ప్రకాశించేలా చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆడపిల్లలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఆడబిడ్డల భద్రత, శ్రేయస్సుకే మా ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. సమాన అవకాశాలు కల్పిస్తూ.. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా భవిష్యత్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.