బాలికా దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. బాలికలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా రాణిస్తారని పేర్కొన్నారు. బాలికల హక్కులు, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
బాలికల పట్ల వివక్షను విడనాడి స్వేచ్ఛనివ్వాలని, లింగ అసమానతలను కలిసికట్టుగా రూపుమాపుదామని అన్నారు. కుటుంబాలు, సమాజం, దేశాన్ని నిర్మించడంలో మహిళలదే కీలక పాత్ర అని లోకేష్ తెలిపారు.