పవన్ కళ్యాణ్‌ను దావోస్‌కు చంద్రబాబు ఎందుకు తీసుకుపోలేదని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ఏడు నెలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు.
తిరుమల పవిత్రతను పాడు చేశారని.. చంద్రబాబు ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానేయాలని సూచించారు. దావోస్ పర్యటనలో ఒక్క ఎంవోయూ జరగకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మరోవైపు తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు ఎలాంటి సాయం చేయకుండా గాలికి వదిలేశారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.