మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కర్మాగారం పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆ ఫ్యాక్టరీలో 14 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.