త్రిపురలోని సిపాహీజాల జిల్లాలో లాల్‌సింగ్‌మురా ఏరియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఓ మహిళపట్ల స్వయం సహాయక సంఘం అమానవీయంగా వ్యవహరించారు. ఇంట్లో వంట చేసుకుంటున్న ఆమెను బయటికి ఈడ్చుకొచ్చి మూకుమ్మడి దాడి చేశారు. అంతేకాకుండా బలవంతంగా గుండు గీశారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళను కాపాడారు. అనంతరం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.