పరిటాల రవి వర్ధంతి సందర్భంగా వెంకటాపుపురంలోని పరిటాలరవి నివాసానికి శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజు వెళ్లారు.
మొదటగా రవీంద్ర ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పరిటాల రవీంద్ర సతీమణి, మాజీ మంత్రి సునీతమ్మను తన నివాసంలో కలిసి పరామర్శించారు. పరిటాలరవి పేదల కోసం చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.