ఈరోజు మళ్లీ భారీగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,040 పాయింట్లు పెరిగి 56,817కి చేరుకుంది. నిఫ్టీ 312 పాయింట్లు లాభపడి 16,975కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (4.69%), యాక్సిస్ బ్యాంక్ (3.65%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.60%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.92%), ఇన్ఫోసిస్ (2.69%).బీఎస్ఈ సెన్సెక్స్ లో సన్ ఫార్మా (-0.35%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.07%) నష్టపోయాయి.