జూపాడు బంగ్లా మండలం లోని పారుమంచాల గ్రామంలో 30 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు.గురువారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం తెలియడంతో ఎస్ఐ ఆ గ్రామానికి వెళ్లగా 30 బస్తాల బియ్యం గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లాలని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు