ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి జూపార్క్ రోడ్ లో చిరుత కలకలం సైన్స్ సెంటర్ వద్ద వ్యక్తిపై దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 11, 2025, 07:22 PM

ఆధ్యాత్మిక నగరం తిరుపతి శేషాచలం అడవులను ఆనుకుని ఉంటుందన్న సంగతి తెలిసిందే. తిరుపతి-తిరుమల కొండలపై వన్యప్రాణి సంచారం ఎక్కువగా ఉంటుంది. పలుసార్లు వన్య ప్రాణులు తిరుపతిలో జనావాసాల్లోకి వచ్చిన సంఘటనలు జరిగాయి. తాజాగా, తిరుపతిలోని జూపార్క్ రోడ్ లో చిరుతపులి కలకలం రేగింది. ఇక్కడి సైన్స్ సెంటర్ వద్ద చిరుతపులి ఓ వ్యక్తిపై దాడి చేసింది. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చిరుత బారినపడిన వ్యక్తిని టీటీడీ ఉద్యోగి మునికుమార్ గా గుర్తించారు. అతడు బైక్ పై వెళుతుండగా చిరుత దాడి చేసినట్టు తెలిసింది


.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com