భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామానికి పదేళ్ల ముందే బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసిన వడ్డె ఓబన్న.. వీరత్వానికి మారుపేరు అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కొనియాడారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకం నారాయణమూర్తి, వడ్డెర నాయకులు వేముల శివ, బేబీ రాణి, గుండెల్ల ఏడుకొండలు, బత్తుల ఈశ్వరి, ఇర్ల రవిచంద్ర, వేముల ఏసుదాసు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పార్టీ నేతలు స్మరించుకున్నారు.