తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీదే పూర్తి బాధ్యత అని, అందుకే వెంటనే బోర్డును రద్దు చేయాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వమే బోర్డును రద్దు చేయాలని ఆయన తేల్చి చెప్పారు. అలాగే ఈ దుర్ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని.. హైకోర్టు సీజే కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన నేరం మాఫీ కాదన్నారు.