భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కువగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్‌కు తగ్గట్లుగానే రేట్లు కూడా అలాగే ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగా ఉంటాయి. అక్కడ రేట్లను బట్టే ఇక్కడ కూడా మారుతుంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ రేట్లు పెరుగుతాయి. అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతుంది. అదే అక్కడ స్థిరంగా ఉంటే.. దేశీయంగా కూడా స్థిరంగానే ఉంటాయని చెప్పొచ్చు.
దేశీయంగా బంగారం రేట్లు ఏ జువెల్లరీలో గ్రాముకు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం. కల్యాణ్ జువెల్లరీలో జనవరి 11న గ్రాము బంగారం ధర రూ. 7,315 గా ఉంది. ఇక తనిష్క్ జువెల్లరీలో చూస్తే గ్రాము గోల్డ్ రేటు రూ. 7,375 గా ఉంది. మలబార్ గోల్డ్‌లో కూడా 22 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ. 7,315 గా ఉంది. జోయాలుక్కాస్‌లో కూడా గ్రాము పసిడి ధర రూ. 7,315 వద్ద కొనసాగుతోంది.
బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. క్యారెట్ వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లుగా చెబుతారు. ఇది 99.9 శాతం ప్యూర్ గోల్డ్ అన్నమాట. ఇది బంగారు ఆభరణాలు తయారు చేసేందుకు వీలుపడదు. దీనిని కాయిన్స్, బార్లు, బిస్కెట్ల రూపంలో విక్రయిస్తారు. నగలు తయారు చేసేందుకు 22 క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన బంగారం వినియోగిస్తారు.
ఇండియాలో ఒక వ్యక్తి ఇంట్లో ఎంత బంగారం నిల్వ చేసుకోవచ్చనే దానిపై చట్టపరంగా ఎలాంటి పరిమితి లేదు. అయితే వీటికి ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకుండా ఉంచుకుంటే ఇన్‌కంటాక్స్ పన్ను విధించే అవకాశాలు ఉంటాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ మార్గదర్శకాల ప్రకారం.. మహిళలు ఎలాంటి ప్రూఫ్ లేకుండా గరిష్టంగా 500 గ్రాములు (50 తులాలు), పెళ్లి కాని యువతి దగ్గర 250 గ్రాములు, పురుషులు అయితే 100 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు.