ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సొరంగం చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నా..: ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Sat, Jan 11, 2025, 09:06 PM

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ... దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తుంటారు. అయితే వీలు కల్పించుకుని మరీ అక్కడకు వెళ్తూ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయితే తాజాగా జమ్ము కశ్మీర్‌లో ఏర్పాటు చేసిన ఓ భారీ టన్నెల్‌ను ప్రారంభించేందుకు కూడా వెళ్లనున్నారు. అయితే ఆ మార్గాన్ని చూసేందుకు తానెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. ఎప్పుడెప్పుడు వెళ్తానా అని భావిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. మోదీ మనసుకు నచ్చిన ఆ సొరంగ మార్గం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


జమ్ము అండ్ కశ్మీర్ గందర్‌బల్ జిల్లాలోని సోన్‌మార్గ్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఓ భారీ సొరంగ మార్గాన్ని నిర్మిచింది. అయితే చాలా కాలం క్రితమే ఆ నిర్మాణ పనులను ప్రారంభించగా.. ఇటీవలే ఆ సొరంగ మార్గం పూర్తి అయింది. ఈక్రమంలోనే ఆ సొరంగాన్ని డిసెంబర్ 13వ తేదీ సోమవారం రోజు ప్రారంభించాలని ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ సోన్‌మార్గ్ సొరంగాన్ని నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే ప్రారంభించనున్నారు.


ఈక్రమంలోనే జమ్ము అండ్ కశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ఆ సొరంగ మార్గం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా చెబుతూ.. కొన్ని ఫొటోలు కూడా షేర్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నందున.. ఏర్పాట్లను పరిశీలించేందుకు తాను అక్కడకు వెళ్లినట్లు వివరించారు. అయితే ఈ సొరంగం ఏడాది పొడవునా.. పర్యాటకుల కోసం తెరిచే ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని స్కై రిసార్ట్‌గా అభివృద్ధి చేసేందుకు సర్కారు సిద్ధమైందని స్పష్టం చేశారు. అలాగే శీతాకాలంలో ఇక్కడి ప్రజలంతా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని రాసుకొచ్చారు. అలాగే శ్రీనగర్ నుంచి కార్గిల్ లేహ్‌కి ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని వెల్లడించారు.


ఈ పోస్ట్ చూసిన ప్రధాని మోదీ.. రీషేర్ చేస్తూ తాను కూడా ఈ ప్రారంభోత్సవానికి వచ్చేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు వివరించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధితో పాటు స్థానిక ప్రజలకు చేకూరే ఆర్థికంగా ప్రయోజనాలను చాలా చక్కగా వివరించారంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రధాని మోదీ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com