గుడిబండ మండలం పరిధిలోని శంకరగల్లు గ్రామంలో శ్రీదేవి అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పంటలకు వాడే పిచికారి మందును సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంధువుల ద్వారా వెలుగు చూసింది, బంధువులు హుటావుటిన మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఆమెకు గత 6 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన రవికుమార్ తో ప్రేమ వివాహం జరిగిందని వారికి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిసింది. వివరాలు తెలియాల్సివుంది.