రాప్తాడు నియోజక వర్గంలో రోడ్ల సమస్యలు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె గురువారం టీడీపీ ధర్మవరం నియోజకవర్గం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ తో కలిసి మండలంలోని ముత్యాలంపల్లి నుంచి వెంకటాపురం వరకు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు,. నాలుగున్నర కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులను రూ.75లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులు చేపట్టారు. పనులు దాదాపు పూర్త అయిన నేపధ్యంలో వారు రోడ్డును పరిశీ లించారు. ముత్యాలంపల్లిలో గ్రామస్థుల కోరిక మేరకు పరిటాల రవీంద్ర నిర్మించిన కమ్యూనిటీ భవనానికి మరమ్మతులు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎగువపల్లి నుంచి పీఆర్ కొట్టాల వరకు దాదాపు రూ. 2.70 కోట్లతో త్వరలో నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ఆమె తెలిపారు. పేరూరు ప్రాజెక్టు దిగువభాగంలో ఉన్న చెరువును స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ట్యాంక్ బండ్ తరహాలో విగ్రహాలను ఏర్పాటు చేయాలని, పార్కు తరహాలో అబివృద్ధి చేయాలని గ్రామస్థులు కోరగా, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట టీడీపీ సీనియర్ నాయకులు ఎల్ నారాయణచౌదరి, రామ్మూర్తినాయుడు, పరంధామయాదవ్, చండ్రాయుడు, సుధాకర్, లక్ష్మీనారాయణరెడ్డి, దుర్గార్లపల్లి వెంకటేశ, బడిగ నాగభూషణ, మాదాపురం శంకర్, కోడి రామ్మూర్తి, బడగొర్ల నాగరాజు, చెన్నయ్య పాల్గొన్నారు.