కడప రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో మహిళపై జరిగిన దాడి ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తులసీ నాగప్రసాద్ తెలిపారు. కడప మోచంపేటకు చెందిన హబీబున్నిసా ఇంట్లో అన్సర్ అనే వ్యక్తి కొంతకాలం నుంచి అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇల్లు ఖాళీ చేయాలని హబీబున్నిసా అన్సర్ తో చెప్పారు. ఇంటికి సంబంధించి రూ. 2 లక్షల మేర ఖర్చు పెట్టానని సదరు మొత్తం ఇస్తేనే ఖాళీ చేస్తానని అతను చెప్పడంతో వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో అతనితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఆమెపై చెయ్యి చేసుకున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పోలీసు స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తుండగా తన ఎదుటే సదరు మహిళపై దాడి చేయబోయాడని ఎస్సై చెప్పారు. దీంతో బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అయితే ఎస్సై తనను అకారణంగా కొట్టాడని వాతలు పడ్డాయని అన్సర్ ఆరోపించారు. తన ఎదుటే మహిళపై చెయ్యి చేసుకోబోయాడని వాతలు పడేవిధంగా కొట్టాల్సిన అవసరం లేదని ఎస్.ఐ చెప్పారు.