తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా కాట్టుమన్నార్కోయిర్ రోడ్డుపై మొసలి నడిచి వెళ్లడంతో చుట్టుపక్కల ప్రజలు హడలెత్తిపోతున్నారు. చిదంబరం సమీపం కూడువెలిచావిడి గ్రామ సమీపంలోని కొలను నుంచి బయటకు వచ్చిన మొసలి కాట్టుమన్నార్కోయిల్ రోడ్డు దాటి వెళ్తుండడాన్ని గమనించిన వాహన చోదకులు, ఆ దృశ్యాలు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. మొసలి సంచారంతో భీతిల్లుతున్న ఆ ప్రాంత ప్రజలు, మొసలిని బంధించి తగిన ప్రాంతంలో విడిచిపెట్టాలని అటవీ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.