ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలిన ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బీజాపుర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో చోటుచేసుకుంది. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్, సీఆర్ఫీఎఫ్ జవాన్లు మంగళవారం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబ్‌పై ఇద్దరు జవాన్లు అడుగు వేయడంతో అది పేలింది. ఆ ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మరో జవాను మావోయిస్టులు అమర్చిన బూబీ ట్రాప్‌పై అడుగు వేయడంతో గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్లను రాయపూర్ ఆస్పత్రికి తరలించారు.