రక్తహీనత నివారణపై అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ విజయనగరం జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహనరావు అన్నారు. మక్కువ మండలంలోని శంబర పీహెచ్సీని ఆయన మంగళవారం పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నెల 10 నుంచి నిర్వహించనున్న డీవార్మింగ్ కార్యక్రమానికి తగు ప్రణాళికలు సిద్ధం చేసు కోవాలని సూచించారు. ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం శంబర జాతరలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మక్కువ, శంబర పీహెచ్సీల వైద్యాధికారులు జి.హరికృష్ణ, ఎంవీ కిరణ్కుమార్, నిఖిల పాల్గొన్నారు.