టీటీడీ అధికారులు శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల జారినీ బుధవారం రాత్రి నుంచి పునరుద్దరించనున్నారు. రధసప్తమి వేడుకల నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి ఎస్డి టోకెన్స్ జారినీ టీటీడీ అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. రధసప్తమి వేడుకలు ముగియడంతో తిరిగి బుధవారం రాత్రి 10 గంటల నుంచి భక్తులకు టోకెన్స్ను టీటీడీ అధికారులు జారి చేయనున్నారు. కాగా సప్తవాహనసేవల ఊరేగింపులతో సప్తగిరులు పులకించిపోయాయి. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణలు, కర్పూరహారతులు, భజన, నృత్య, వాద్య బృందాల ప్రదర్శనలతో నాలుగు మాడవీధులు మారుమోగాయి. మంగళవారం తిరుమలలో రథసప్తమి సంబరాలు అంబరాన్నంటాయి.