కర్ణాటకలో 340 కొత్త లైబ్రరీలను ప్రారంభిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు.దీనికి సంబంధించి అవసరమైన ఉత్తర్వులను వెంటనే జారీ చేస్తామని ఆయన ప్రకటించారు.శిక్షణ ఫౌండేషన్, డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్, రూరల్ డెవలప్‌మెంట్, పంచాయత్ రాజ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'గ్రామ డీజీ వికాసన-2022' ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడుతూ.. కొత్త తాలూకాల్లో గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, వాటిని ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుత సంవత్సరంలోనే 3409 గ్రంథాలయాల డిజిటలైజేషన్‌ను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాల్సి ఉంది.సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల్లో డిజిటల్ విముఖత ఉందని, మొబైల్ ఫోన్ల వినియోగంతో డిజిటల్ పరిజ్ఞానం మెరుగైందని, విజ్ఞానం ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వ వికాసానికి వీలుగా గ్రామ పంచాయతీ గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేశామని బొమ్మై చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్‌ను విస్తృతం చేసేందుకు 'గ్రామ డీజీ వికాసన' కార్యక్రమం అభినందనీయమని ప్రశంసించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చిందని, విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా మార్గనిర్దేశం చేసేందుకు ‘ముఖ్యమంత్రి మార్గదర్శిని’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa