ఆంధ్త్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాలలో కానీ , పట్టణాల్లో కానీ ప్రజలకు అవసరాలు తీర్చడానికి కష్టపడకుండా , సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చింది ప్రభుత్వం. అందులో ఇంకా వీరికి సేవ చెయ్యడానికి వాలెంటీర్ వ్యవస్థ కూడా ప్రవేశపెట్టింది. ఎవరికీ ఏ అవసరం ఉన్న , ప్రభుత్వ పనులు ఉన్న వాలెంటీర్ ద్వారానే జరగాలి. వృద్యాప్య పెన్షన్ మరియు రేషన్ , ఆధార్ , ఏదైనా సరే వాలెంటీర్ ద్వారానే జరగాలి. ఇది ఆసరాగా తీసుకున్న ఒక వాలెంటీర్ పెన్షన్ పెరిగింది నీకు 250 రూపాయలు అవ్వ , ఈ కాగితం మీద సంతకం పెడితే వచ్చే నెల నుండి ఎక్కువ వస్తాయి అని చెప్పాడు. అది నమ్మిన అవ్వ వేలిముద్ర వేసింది. అంతే ... అవ్వ పేరు మీద ఉన్న ఆస్తి కాస్త వాలంటీర్ సొంతం ఐనది. ఇది తెలుసుకున్న అవ్వ స్పందన లో పిర్యాదు చేసింది . న్యాయం చెయ్యండి నాయన అని వేడుకొంది. ఇదంతా కాకినాడలో జరిగినట్లుగా తెలిస్తుంది. అది తెలుసుకున్న ప్రతిపక్షాలు సేవా రత్న, సేవమిత్ర, సేవవజ్ర అంటూ సేవా పురస్కారాలు ఇచ్చారు కదా, ప్రజల సొమ్ము కాజేసిన వాలంటీర్ కు ఏ బిరుదు ఇస్తే బాగుంటుంది కూడా మీరే చెప్పండి జగన్ రెడ్డి అని ఎద్దేవా చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa