నరసరావుపేట పట్టణంలో స్థానిక సత్తెనపల్లి రోడ్ లో సోమవారం పట్టణానికి చెందిన చలువాది బ్రహ్మయ్యకు చెందిన మణికంఠ మోడరన్ రైస్ మిల్ మిల్ ను ప్రారంభించి, రైస్ మిల్ ఆవరణలో జరిగిన లక్ష్మీ సరస్వతి పూజ,శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము కార్యక్రమంలో నరసరావుపేట టీడీపీ నాయకులూ అరవింద్ బాబు పాల్గొని తీర్దప్రసాదములు స్వీకరించడం జరిగింది. అలానే మండల కేంద్రమైన రొంపిచర్లలో గల వైన్ షాపుల ముందు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవిందబాబు ఆదేశాల మేరకు సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు ముందు దశలవారీగా మద్యపానం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట తప్పారని అన్నారు.వైసిపి నాయకులు మద్యం అమ్మకాన్ని ఆదాయవనరుగా మార్చుకొని గ్రామాలలో మద్యం బెల్టుషాపులు నిర్వహిస్తున్నారని అన్నారు.గ్రామాలలో,పట్టణాల్లో మద్యం అమ్మకాలతో పాటు గుట్కాలు, పాన్ మసాలా విక్రయాలు విచ్చలవిడిగా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని ఆరోపించారు.జగన్ తన బాబాయిని హత్య చేసి గుండెపోటు,గొడ్డలిపోటు అని ప్రచారం చేశారని అన్నారు.కల్తీ సారా మరణాలను సహజ మరణాలని చిత్రీకరించటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.కల్తీ సారా వలన మరణించిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మద్యపానం నిషేధించాలి-నాటుసారా అరికట్టాలంటూ నినాదాలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa